శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 08, 2020 , 04:40:57

బంద్‌ను విజయవంతం చేయాలి

బంద్‌ను విజయవంతం చేయాలి

  • నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి 

నారాయణపేట టౌన్‌ : దేశవ్యాప్త బంద్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యాసంస్థలు, కుల సంఘాల సభ్యులు బంద్‌ లో పాల్గొనాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం రైతులకు మరణశాసనంలా మారిందన్నారు. దీని వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బంద్‌ సందర్భంగా మరికల్‌ హైవేను దిగ్భంధం చేస్తామన్నారు. 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత...

వివిధ కారణాలతో దవాఖానల్లో చికిత్సలు చేయించుకొని సీఎం సహాయ నిధి కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్‌.రా జేందర్‌రెడ్డి అందజేశారు. పట్టణానికి చెందిన వీరన్నస్వామికి రూ.38వేలు, సల్మాఖతూంకు రూ.12వేలు, అరుణకు రూ.60వేలు, ఇందిరకు రూ.60వేలు, నర్సమ్మకు రూ.10 వేలు, లక్ష్మికి రూ.15వేలు, గోరిబేగానికి రూ.60వేలు, జ  యమ్మకు రూ.28వేలు, అశోక్‌కు రూ.60వేలు, అబ్దుల్‌ ర  హమాన్‌కు రూ.39వేలు, నందినికి రూ.13వేలు, సనఖ తూంకు రూ.20వేలు, లావణ్యకు రూ.20వేల చెక్కులను అందజేశారు. అదేవిధంగా మండలానికి సంబంధించి అక్షిత్‌కుమార్‌కు రూ.42వేలు, తేజనాయక్‌కు రూ.36వేలు, రా ములుకు రూ.32వేలు, కిషన్‌రెడ్డికి రూ.60వేలు, నర్సమ్మ  కు రూ.22వేలు, రాజుకు రూ.60వేలు, హన్మంతుకు రూ. 20 వేలు, మల్లేశ్‌కు రూ.28వేలు, అనిల్‌కుమార్‌కు రూ.13 వేల 500, సాయప్పకు రూ.18వేల చెక్కులను పంపిణీ చే శారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.  

‘విద్యుత్‌ చట్టం 2020ని వ్యతిరేకిస్తాం’

మరికల్‌ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విద్యుత్‌ 2020 బిల్లును వ్యతిరేకిస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ 1104 యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్మికుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖ విషయంలో కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు తెచ్చిన నూతన చట్టాన్ని దేశవ్యాప్తం గా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయన్నారు. విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఒకే రకమైన చట్టం ఉండాలన్నారు. ఎఫ్‌టీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌లకు మార్చాలని కోరారు. ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. అనంతరం మండలంలోని సబ్‌ స్టేషన్‌ వద్ద యూనియన్‌ నాయకులు జెండాను ఆవిష్కరించారు.

బంద్‌కు మద్దతు...

దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్‌కు విద్యుత్‌ శాఖ యూనియన్‌ 1104 సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నా రు. కేంద్రం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్ట డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.  

ప్రజలు సహకరించాలి

రైతు సంఘూలు చేపట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. బంద్‌లో ఎమ్మెల్యే ఎస్‌. ఆర్‌.రెడ్డి మండల కేంద్రంలో పాల్గొంటారన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సర్పంచ్‌ గోవర్ధన్‌, ధన్వాడ పీఏసీసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, ప ట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నా యకులు పాల్గొన్నారు.

అందరూ మద్దతు ఇవ్వాలి

దామరగిద్ద : ఢిల్లీలో నిర్వహిస్తున్న రైతుల బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ఎంపీపీ నర్సప్ప పిలుపునిచ్చారు. మండలంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులందరూ బంద్‌కు మ ద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

వివాదాస్పద బిల్లులను రద్దు చేయాలి

కృష్ణ : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందేనంటూ నిరసనలో భాగంగా నేడు నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని క్షీరలింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్రం దేశ రైతాంగాన్ని నిలువునా ముంచే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షురాలు జయపాటిల్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉ పాధ్యక్షుడు శివప్ప, నాయకులు ఉన్నారు.

నూతన వ్యవసాయ చట్టం వద్దు

ఊట్కూర్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని, ఢిల్లీలో నిర్వహిస్తున్న రై తుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నా యకులు ప్రకటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయా పార్టీల నాయకులు లక్ష్మారెడ్డి, సలీం, వెంకట్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నేడు నిర్వహించే దేశ వ్యాప్త బంద్‌ను విజయవంతం చే యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బంద్‌కు రైతులు, మే ధావులు, ప్రజాస్వామిక వాదులు, కార్మిక సంఘాలు, విపక్షాలు, అన్ని వర్గాలు మద్దతు తెలుపాలని కోరారు. సమావేశంలో చెన్నప్ప, ఇబాదుర్హ్రిమాన్‌, మోహన్‌రెడ్డి, తరు ణ్‌, వెంకట్‌రెడ్డి, శివారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

బిల్లులకు వ్యతిరేకంగా బంద్‌

నర్వ : వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేటి బంద్‌కు మండలంలోని వ్యాపారస్తులు, అధికారులు సహకరించి సంపూర్ణ మద్దతు తెలుపాలని ఎంపీపీ జయరాములుశెట్టి, టీఆర్‌ఎస్‌ నాయకులు వి.మహేశ్వర్‌రెడ్డి, పి.హన్మంత్‌రెడ్డిలతోపాటు, కాంగ్రెస్‌ నాయకులు చరణ్‌, వివేకానందరెడ్డి, చెన్నయ్య సాగర్‌ సంయుక్తంగా పిలుపునిచ్చారు. 

బంద్‌కు సహకరించాలి

ధన్వాడ : వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని నేడు తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేడు బంద్‌ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రాంకిష్టాయపల్లి సర్పంచ్‌ మాధవరెడ్డి, కొం డాపూర్‌ మాజీ ఎంపీటీసీ భీంరెడ్డి పాల్గ్గొన్నారు.

విజయవంతం చేయాలి

కోస్గి : దేశవ్యాప్తంగా నిర్వహించే నేటి బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నా రు. బంద్‌లో మండలంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిక సం ఖ్యలో పాల్గొనాలని కోరారు. 

బంద్‌ను విజయవంతం చేద్దాం

మిడ్జిల్‌: కేంద్రం అమోదించిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల సవరణ కోసం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేద్దామని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీటీసీ సుదర్శన్‌ పేర్కొన్నారు. బంద్‌కు రైతులు, విద్యావంతులు బాసటగా నిలువాలని కోరారు. మండలంలోని అన్ని వాణిజ్య సమూదాయాల నిర్వాహకులు స్వచ్ఛందం గా బంద్‌ పాటించాలని కోరారు.

విజయవంతం చేయాలి

హన్వాడ : నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని మంగళవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, ఎంపీపీ బాలరాజు కోరారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను వీ డాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో రైతులతోపాటు, పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. 

రైతుకు సంపూర్ణ మద్దతు

మూసాపేట : కేంద్రం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చ ట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు మంగళవారం చేపట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ శ్రేణులు మద్దతు తెలిపి పాల్గొనాలని  జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీ కళావతి కొండయ్య, టీఆర్‌ఎస్‌ మండలా ధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్‌ తెలిపారు. 

మద్దతు తెలుపుదాం

రాజాపూర్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేందకు ఉద్యమిస్తున్న రైతు సంఘాలకు మద్దతుగా  టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలుపాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్‌  పిలు పునిచ్చారు. బంద్‌కు మద్దతు తెలుపారన్నారు. మంగళవా రం బూర్గుల గేట్‌ వద్ద టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్యెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై నిర్వహించే రా స్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాలు, కుల సం ఘాల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరారు. అదేవిధంగా మండలంలోని వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి భారత్‌ బంద్‌కు మద్దతివ్వాలని కోరారు.

VIDEOS

logo