శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 06, 2020 , 05:37:14

వైభవంగా ఆరాధన ఉత్సవాలు

 వైభవంగా ఆరాధన ఉత్సవాలు

నారాయణపేట టౌన్‌ : పట్టణంలోని అవధూత నరసింహాస్వామి ఆరాధన ఉత్సవాలను మఠం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన సంకీర్తనలతో స్వామి వారి పల్లకీ సేవ ఊరేగించారు. రీజినల్‌ చేనేత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ అరుణ్‌కుమా ర్‌, జయప్రద దంపతులు, జడ్పీ సీఈవో కాళిందిని కుటుం బ సభ్యులను కమిటీ సభ్యులు శేషవస్ర్తాలు, జ్ఞాపికలతో స త్కరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ, కౌన్సిలర్‌ అనిత, మఠం కమిటీ సభ్యులు, భక్తులు కొవిడ్‌ నిబంధన లు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. 


VIDEOS

logo