సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Dec 05, 2020 , 06:27:43

గర్భిణులకు పౌష్టికాహారం అందేలా చర్యలు

గర్భిణులకు పౌష్టికాహారం అందేలా చర్యలు

  • పీపీ యూనిట్‌ వైద్యాధికారి బాలాజీరావు సింగాడే 

నారాయణపేట టౌన్‌ : ప్రతి సోమవారం పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ద వాఖానకు వచ్చే గర్భిణులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని పీపీ యూనిట్‌ వైద్యాధికారి డాక్టర్‌ బాలాజీరావు సింగాడే అన్నా రు. శుక్రవారం పట్టణంలోని పీపీ యూనిట్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, పీపీ యూనిట్‌ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 8న వ్యాసెక్టమి శిబిరం నిర్వహిస్తున్నందున ఎక్కువ మంది పురుషులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నా రు. చలికాలం కారణంగా కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యే సూచనలు ఉ న్నాయి, కాబట్టి ప్రజలకు కొవిడ్‌ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పీపీ యూనిట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo