బుధవారం 20 జనవరి 2021
Narayanpet - Dec 04, 2020 , 02:43:36

యువత ఆటల్లో రాణించాలి

యువత ఆటల్లో రాణించాలి

ధన్వాడ: యువత ఆటల్లో రాణించాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలో క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఓడినవారు నిరుత్సాహపడకుండా గెలుపునకు ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతు లను అందించారు. మొదటి బహుమతి మరికల్‌ జట్టు గెలుచుకోగా రెండో బహుమతిని కంసాన్‌పల్లి దక్కించుకుంది. మొదటి బహుమతి గా రూ.5వేలు, రెండో బహుమతిగా రూ. 2,500 ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, మత్య్స పారిశ్రమికసహకార సంఘం అధ్యక్షుడు నీరటి నర్సింహులునాయుడు, టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు పాల్గొన్నారు. logo