గురువారం 28 జనవరి 2021
Narayanpet - Dec 03, 2020 , 02:07:05

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

నారాయణపేట రూరల్‌ : ఆర్టీసీ బస్సులో అర్ధ తులం బంగారంతో కూ డిన పర్సును గుర్తించి తిరిగి మహిళకు అప్పగించి నిజాయితీ చాటుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. కోస్గికి చెందిన చంద్రకళ ఓ వి వాహ వేడుకలో పాల్గొనేందుకు కోస్గి నుంచి నారాయణపేటకు వచ్చింది. నారాయణపేట నుంచి జాజాపూర్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రకళ పర్సు బస్సు లో పడిపోయింది. ఈ పర్సును గుర్తించిన కండక్టర్‌, డ్రైవర్‌ రాములు, బాలరామ్‌ పరిశీలించారు. పర్సులో అర్ధ తులం బంగారంతోపాటు ఆధార్‌ కా ర్డు, వనిత కార్డు ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని పేట ఎస్సై చంద్రమోహన్‌రావుకు సమాచారం ఇచ్చారు. అయితే ఆధార్‌ కార్డుపై ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఆర్టీసీ డిపో వద్దకు రావాలన్నారు. ఆమె వచ్చిన వెం టనే కానిస్టేబుల్‌ బాలరాజు సమక్షంలో చంద్రకళకు పర్సును అప్పగించా రు. నిజాయితీతో పర్సుతోపాటు అందులోని వస్తువులను అప్పగించినందుకు ఎస్సై, డీఎం సూర్యప్రకాశ్‌రావు అభినందించారు. logo