వాడివేడిగా సాగిన సర్వసభ సమావేశం

నారాయణపేట రూరల్ : జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య స మావేశం వాడివేడిగా సాగింది. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అన్ని ఇండ్లకు పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదని నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరారు. అప్పక్‌పల్లి నుంచి కోయిలకొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోటకొండ, బోమ్మన్పాడ్ గ్రామాల సర్పంచ్‌లు రోడ్డు, భవనాల శాఖ అధికారులకు వివరించారు. గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నయని వాటిని త్వరగా విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల న్నారు. అయితే సమావేశం కొనసాగుతుండగానే పలువురు వివిధ శాఖల అ ధికారులు, ప్రజాప్రతినిధులు మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. సమావేశంలో జడ్పీటీసీ అంజలి, వైస్ ఎంపీపీ సుగుణ, జడ్పీ కో ఆప్షన్ తాజుద్దీన్, మండల కో ఆప్షన్ జావిద్, ఎంపీడీవో సందీప్ కుమార్, సూపరింటెండెంట్ శోభరాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.