సోమవారం 25 జనవరి 2021
Narayanpet - Dec 03, 2020 , 02:07:01

కంపోస్ట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి

కంపోస్ట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి

  •  కృత్రిమ ఎరువులను తయారు చేయాలి
  •  రైతులు వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
  • నారాయణపేట కలెక్టర్‌ హరిచందన

  నారాయణపేట టౌన్‌ : ప్రతి గ్రామంలో, మార్కెట్‌ యార్డుల్లో కంపోస్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేసి కృత్రిమ ఎరువులను తయారు చేయాలని అధికారులను కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) గవర్నింగ్‌ బోర్డు సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. పెరట్లో కోళ్ల పెంపకంపై, యాసంగిలో యాజమాన్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెరి గేందుకు దోహదపడేలా అవగాహన కల్పించాలన్నారు. మట్టి నమూనాల ఆధారంగా పంటలు సాగు చేసేలా వీడియో రూపంలో అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఆముదం పంట సాగు తగ్గుతున్నదని, ఈ నేపథ్యంలో కర్షకులకు ప్రదర్శన ఇప్పించాలన్నారు.

అలాగే బొట్రటిస్‌ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం 2020-21 సంవత్సరానికి సంబంధించి చేపట్టాల్సిన ప్రదర్శన క్షేత్రాలు, శిక్షణ కార్యక్రమాలపై బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌, జెడ్పీ డిప్యూటీ సీఈవో సిద్రామప్ప, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అబ్దుల్‌ రషీద్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రసన్నకుమార్‌, డీఏఏటీటీసీ సెంటర్‌ శాస్త్రవేత్త రామకృష్ణబాబు, డీలర్లు పాల్గొన్నారు. 


logo