సీటు కోసం వేసిన బ్యాగ్ చోరీ

- 6 తులాల బంగారం, రూ.6వేలు అపహరణ
- నారాయణపేట బస్టాండ్‌లో ఘటన
నారాయణపేట: బస్సు సీటు కోసం కిటికిలో నుంచి బ్యాగ్ ఉంచిన ఓ ప్రయాణికురాలి బ్యాగు అపహరణకు గురైన సంఘటన మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్నది. బాధితురాలు, ఆమె తండ్రి కథనం ప్రకారం నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హైమావతి తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు తన తండ్రి కృష్ణారెడ్డితో కలిసి నారాయణపేట బస్టాండ్‌కు చేరుకున్నది.
ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ వద్దకు వచ్చిన బస్సు డోర్ వద్ద ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సీటు కోసం తన బ్యాగును బస్సు కిటికీలోంచి సీటుపై పెట్టింది. ఆ తర్వాత బస్సులోకి వెళ్లి సీటు వద్దకు చేరుకోగా సీటుపై ఉంచిన బ్యాగు కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రయాణికురాలు హైమావతి వెంటనే తేరుకొని తన బ్యాగ్ పోయిందని కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినప్పటికీ బ్యాగ్ ఆచూకీ లభించలేదు. బ్యాగులో 3లక్షల విలువ చేసే 6తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.6వేల నగదు ఉన్నట్లు బాధితురాలు హైమావతి, తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ చంద్రమోహన్‌రావు తెలిపారు.
తాజావార్తలు
- లాక్డౌన్ పొదుపు 14.60 లక్షల కోట్లు
- కాలగర్భంలోకి స్కూటర్స్ ఇండియా
- వరంగల్‌కు విదేశీయుల వరుస..
- బెంగాల్ బీజేపీ ఆఫీసులో ఘర్షణ: వాహనాలకు నిప్పు
- 10 కోట్ల హీరో
- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ : ఇద్దరికి గాయాలు
- సంక్షోభంలోనూ సంక్షేమం
- రేషన్ అక్రమ నిల్వ చట్టవిరుద్ధం : జేసీ
- బదిలీపై జిల్లాకు ఇద్దరు డీఆర్వోలు
- సింగారాల ఉంగరాలు!