శనివారం 16 జనవరి 2021
Narayanpet - Nov 30, 2020 , 02:35:07

రేషన్‌ దుకాణాల్లో కొవిడ్‌ ప్యాకేజీని కొనసాగించాలి

రేషన్‌ దుకాణాల్లో  కొవిడ్‌ ప్యాకేజీని కొనసాగించాలి

నారాయణపేట టౌన్‌ : కరోనా కారణంగా రేషన్‌ దుకాణాల్లో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా ఇస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీని కొనసాగించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున, జూలై నుంచి నవంబర్‌ వరకు 10 కిలోల చొప్పున ఇచ్చారన్నా రు. కార్యక్రమాన్ని డిసెంబర్‌ నుంచి ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. 

        దేశ వ్యాప్తంగా కరోనా రెండో దశ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కారణంగా వలస కూలీలు, ఇతర రంగాలపై ఆధారపడ్డ వారు సొం త గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం లేదన్నారు. ఉన్న గ్రామాల్లో సరైన ఉపాధి లేనట్లయితే పూట గడవక ఇబ్బందులు పడా ల్సి వస్తుందన్నారు. విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఇచ్చే 12కిలోల రేషన్‌ బియ్యం పంపిణీని కొనసాగించాలని కోరారు. అలాగే ఒక్కో కార్డుకు రూ.5వేలు ఇవ్వాలని కోరారు.