ఆదివారం 17 జనవరి 2021
Narayanpet - Nov 29, 2020 , 04:03:24

సకాలంలో బాధితులకు న్యాయం చేయాలి

సకాలంలో బాధితులకు న్యాయం చేయాలి

నారాయణపేట: కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులకు శిక్షలు పడడానికి దోహదం చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని ఎస్‌హెచ్‌వోలు సూచించారు. శనివారం జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌, విచారణ విషయంలో కోర్టు డ్యూటీ అధికారులు కోర్టులోని వివిధ అధికారులను సమన్వయ పరుస్తూ సాక్షులను, నిందితులను కోర్టులో హాజరుపరచాలన్నారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు.