శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 29, 2020 , 04:03:27

విశ్వశాంతికి పూజలు చేయాలి

విశ్వశాంతికి పూజలు చేయాలి

నారాయణపేట టౌన్‌: విశ్వశాంతి కోసం ఈనెల 30వ తేదీన రాత్రి 9గంటలకు జిల్లాలోని అయ్యప్పస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య అన్నారు. శనివారం పట్టణంలోని శబరిపీఠం సన్నిధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయాల్లోనే కాకుండా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించి గంట సేపు భజన సంకీర్తనలతో భగవంతుడి నామస్మరణ చేయాలని కోరారు. సమావేశంలో అయ్యప్ప మాలధారులు రాజశేఖర్‌, అంజి, భరత్‌, బాలు, మణికంఠ తదతరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo