ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Nov 29, 2020 , 04:03:27

తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

  • ఆభరణాలు, నగదు అపహరణ

నారాయణపేట:  పట్టణంలో శనివారం తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఆగంతకులు భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఎస్సై  చంద్రమోహన్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌గఫార్‌, ఆయన తమ్ముడు శనివారం ఉదయం 10 గంటలకు బాహర్‌పేటలోని బువ్వమ్మ దర్గా ఉర్సును చూసేందుకు సభ్యులతో కలిసి వెళ్లారు. దర్గా నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఇంటి తాళం తీసి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అబ్దుల్‌ గఫార్‌, ఆయన తమ్ముడి ఇంట్లో దాదాపు 7 తులాల బంగారం,  20 తులాల వెండి ఆభరణాలు, రూ. లక్ష నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. గఫార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.  


VIDEOS

logo