బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Nov 26, 2020 , 02:31:12

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  • కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌: తుఫాను కారణంగా జిల్లాలోని పలు చోట్ల గురు,శుక్ర,శని వారాల్లో వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన ప్రకటనలో సూచించారు. వీలైనంత ధాన్యాన్ని  గుత్తేదారు సహాయంతో మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాలలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కవర్లతో కప్పుకోవడం లేదా తడవకుండా ఉండే చోట్ల భద్రపరచుకోవాలన్నారు. నిర్వాహకుల అలసత్వం కారణంగా ధాన్యం తడిసినా, పా డైనా బాధ్యత నిర్వాహకులదేనన్నారు. అలాగే 3 రోజుల వరకు రైతులు వరికోతలు చేపట్టొద్దని, తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురాకూదని కోరారు.  

  మక్తల్‌ టౌన్‌:  రైతులు పత్తి ,వరి  ధాన్యాన్ని టార్పాలిన్‌తో భద్రంగా కప్పి ఉంచుకోవాలని వ్యవసాయ అధికారి మిథున్‌ చక్రవర్తి తెలిపారు.అదేవిధంగా రైతులు పత్తిని  రెండురోజులు సీసీఐ సెంటర్‌కు తీసుకెళ్లొద్దని  తెలిపారు.  

పరిశ్రమల స్థాపనకు 86 దరఖాస్తులకు అనుమతి

నారాయణపేట టౌన్‌: టీఎస్‌ ఐపాస్‌ కింద పరిశ్రమల స్థాపనకు జిల్లాలో మొత్తం 86 దరఖాస్తులకు అనుమతి ఇచ్చినట్లు డీఐపీసీ, టీఎస్‌ ఐపాస్‌ చైర్మన్‌, కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయన్నారు. ట్రిఫైడ్‌ పథకం ద్వారా వాహనాల కోసం 71 దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీల నుంచి 39, ఎస్టీల నుంచి 28, దివ్యాంగుల నుంచి 4 దరఖాస్తులు వచ్చాయన్నారు. మహిళలకు 45శాతం సబ్సిడీ, పురుషులకు 35శాతం సబ్సిడీ మంజూరు చేశామన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ రామసుబ్బారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo