సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 25, 2020 , 06:36:39

వాహనాలను ఈ వేలం వేయాలి

వాహనాలను ఈ వేలం వేయాలి

నారాయణపేట టౌన్‌ : తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలను ఈ వేలం వేసేందుకు ప్రొఫార్మా తయారు చేసి వేలం వేసేందుకు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మొత్తం 6 ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని ఈ వేలం వేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌ఐ కృష్ణయ్య, ఏవో ఖలీద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.VIDEOS

logo