సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Nov 23, 2020 , 02:34:44

మైనర్‌ బాలికపై లైంగికదాడి

మైనర్‌ బాలికపై లైంగికదాడి

మిడ్జిల్‌ : మండలంలోని ఓ తండాకు చెందిన మైనర్‌ బాలిక(7)పై లైంగికదాడికి పాల్పడిన రమేశ్‌నాయక్‌ (20)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్‌బాబు తెలిపారు. చేదుగట్టుతండాలో నివాసముంటున్న రమేశ్‌నాయక్‌ మైనర్‌బాలికపై లైంగికదాడికి పాల్పడగా, బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ మేరకు ఘటనా స్థలం లో విచారణ నిర్వహించిన అనంతరం బాలికను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేశ్‌నాయక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

VIDEOS

logo