సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 23, 2020 , 02:34:44

ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

నారాయణపేట : ఎన్‌సీసీతో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ లక్ష్మణాచారి అన్నారు. ఆదివారం 72వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీ క్యాడెట్లు శిక్షణలో లౌకికతత్వం, జాతీయ సమైక్యత అలవరచుకోవాలని సూచించారు. సమాజ సేవ చేసేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు ఎన్‌సీసీ క్యాడెట్స్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డా.భాస్కర్‌రెడ్డి, సురేశ్‌, కాంతు, దశరథ్‌, వెంకటేశ్‌, ఆనంద్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సురేఖ, చందన పాల్గొన్నారు. 


VIDEOS

logo