ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Nov 23, 2020 , 02:34:44

దుప్పట్లు పంపిణీ

దుప్పట్లు పంపిణీ

నారాయణపేట రూరల్‌ : పట్టణ శివారులోని దామరిగిద్ద రోడ్డులో గల ఇటుకల బట్టిలో పని చేస్తున్న కార్మికులకు పేట లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌ ముఖ్య అతిథిగా హాజరై దుప్పట్లను లయన్స్‌ క్లబ్‌ సభ్యలతో కలిసి అందజేశారు. చలి ఎక్కువగా ఉన్నదున కార్మికుల అ వసరాలు గుర్తించి దుప్పట్లు, తలపాగాలు పంపిణీ చేయడం అభినందనీ యమన్నారు. కార్యక్రమంలో  క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బాలాజీ, కృష్ణభగవాన్‌, కోశాధికారి జనార్దన్‌, సత్యం, బాలాజీ కాంబ్లె పాల్గొన్నారు.

సమరిటన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో...

మహబూబ్‌నగర క్రైం :  సమరిటన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, వృద్ధ్దాశ్రమాలలో రాత్రి నిద్రపోయే అభాగ్యులకు రెండు వందల దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సం ఘం సభ్యులు మాట్లాడుతూ తమ గ్రూప్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమరిటన్‌ గ్రూప్‌ సభ్యులు శ్యామ్‌ యేలురాజ్‌, అనిల్‌, ప్రమోద్‌, జీవన్‌, నిశాంత్‌, జయరాజ్‌, దిలీప్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo