శనివారం 28 నవంబర్ 2020
Narayanpet - Nov 22, 2020 , 01:09:43

బాధితులకు భరోసా కల్పిస్తాం : ఎస్పీ

బాధితులకు భరోసా కల్పిస్తాం : ఎస్పీ

ధన్వాడ : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భరో సా కల్పిస్తామని ఎస్పీ డాక్టర్‌ చేతన అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. సీఐ అహ్మ ద్‌, ఎస్సై రాజేందర్‌, కానిస్టేబుల్స్‌తో ఎస్పీ మాట్లాడారు. ఫిర్యాదుదారుడు నేరుగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా స్నేహపూర్వ వాతావరణం కల్పించాలని ఆదేశించారు. బాధితులు జిల్లాలోని ఏ స్టేషన్‌కైనా ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా వస్తే త్వరతగతిన స్పందించాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయని ఎస్పీ నేరుగా వారిని అగిడి తెలుసుకున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసుకు వచ్చి నేరుగా కలువచ్చాని ఆమె తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి ఫ్రీ ఎప్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయాలన్నారు. దొంగతనల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణాను నిరోధించడం కోసం సిబ్బంది మంచిగా పని చేయాలని ఎస్పీ సూచించారు.