శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 22, 2020 , 01:09:40

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌ : జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమి సం హారక మందులు, వ్యవసాయ యంత్రాలు సరసమైన ధరల్లో అందిస్తామని ఆగ్రోస్‌ సేవా కేంద్రం జిల్లా ఇన్‌చార్జి విన్‌సన్‌ శనివారం ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లాలో మొత్తం 12 ఆగ్రోస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆగ్రోస్‌ కేంద్రాల్లో ఐపీఎల్‌, క్రిబ్‌కో, ఇఫ్కో తదితర కంపెనీల ఎరువులు, ముల్కనూరు, నేషనల్‌, నూజివీడు, మహికో, కావేరి, జి.కె.బ యో సీడ్స్‌ తదితర కంపెనీలకు చెందిన విత్తనాలు లభిస్తాయన్నారు. యూ పీఎల్‌, ఇండోఫీల్‌, క్రిస్టల్‌ కంపెనీలకు చెందిన పురుగుల మందులు, జీవరసాయన మందులు, మైక్రో న్యూట్రీఎంట్స్‌, నీమ్‌ ఆయిల్‌, టార్ఫారెన్స్‌, స్ప్రెయర్లు, సిటీ కంపోస్ట్‌ ఎరువులు లభిస్తాయన్నారు. 


VIDEOS

logo