ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Nov 21, 2020 , 03:13:21

బాలల సంరక్షణ కోసం చైల్డ్‌లైన్‌ 1098

బాలల సంరక్షణ కోసం చైల్డ్‌లైన్‌ 1098

నారాయణపేట : బాలల సంరక్షణ కోసం 24 గంటలపాటు చైల్డ్‌లైన్‌ 1098 పని చేస్తుందని ఎస్పీ డాక్టర్‌ చేతన అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న, తప్పిపోయిన, శారీరక వేధింపులకు గురైన, బాల్య వివాహాలు జరుగుతున్న 1098, డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకొని సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఉమాదేవి, చైల్డ్‌లైన్‌ 1098 జిల్లా కో ఆర్టినేటర్‌ నరసింహ, రవికుమార్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo