కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

- కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విత్తన తేమ మీటర్‌తో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ, రైతులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ జిల్లాలో 1.33లక్షల క్వింటాళ్ల ధాన్యం రావాల్సి ఉండగా ఇప్పటివరకు మూడువేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. కలెక్టర్ వెంట మెప్మా పీడీ కృష్ణమాచారి, సివిల్ సైప్లె అధికారి శివప్రసాద్‌రెడ్డి, డీఎం హథిరాం, ఏడీఎంసీ శేషన్న, టీఎంసీ లక్ష్మీ, టీఆర్ఎస్ నాయకులు గందె చంద్రాకాంత్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కన్నా జగదీశ్ తదితరులు ఉన్నారు.
చిన్నజట్రంలో..
నారాయణపేట రూరల్ : మండలంలోని చిన్నజట్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హరిచందన బుధవారం తనిఖీ చేశారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మెప్మా పీడీ కృష్ణమాచారి, డీఎస్వో శివప్రసాద్‌రెడ్డి, డీఎం హథిరాం, డీఎంసీ శేషు, లక్ష్మి, జ్యోతి ఉన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్