అటవీశాఖ ఆంక్షలు

- ఉమామహేశ్వరం ఆలయానికి వెళ్లే దారిలో చెక్‌పోస్టు
- వాహనాన్ని బట్టి డబ్బులు వసూలు
- ఇబ్బందులు పడుతున్నామంటున్న భక్తులు
అచ్చంపేట : నల్లమల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వరం దేవాలయానికి వెళ్లే భక్తులకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. మండలంలోని రంగాపూర్ నుంచి కొద్ది దూరంలో అటవీశాఖ బేస్ క్యాంపు ఉంటుంది. అక్కడ ఉమామహేశ్వరం ఆలయానికి వెళ్లే రహదారి మధ్యలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి వాహనాలను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగాపూర్ గ్రామం నుంచి ఉమామహేశ్వర క్షేత్రం కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మిగిలిన సందర్భాల్లో భక్తుల సందడి పెద్దగా ఉండదు. ఉమామహేశ్వర ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ద్ధి చెందుతున్నది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో భక్తుల కోసం షెడ్డు, డార్మెంటరీ, బట్టలు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, అన్నదానం తదితర పనులు చేపట్టారు. దీంతో భక్తుల రాక క్రమంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు ఎప్పుడూ లేని విధంగా ఆలయం వద్దకు వెళ్లాలంటే ద్విచక్రవాహనానికి రూ.30, కారుకు రూ.60, ఆటోకు రూ.50, ఇతర వాహనాలకు రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వాహనాలను అక్కడే నిలిపివేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులు భక్తులతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆలయానికి వెళ్లాలంటే కూడా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆంక్షలు పెట్టడం సరైందికాదని దేవాలయం అధికారులు పేర్కొంటున్నారు. అటవీశాఖ నుంచి దేవాలయం అభివృద్ధిలో ఎలాంటి పాత్ర లేకపోగా.. కొండ కింద నుంచి పైకి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మొత్తం వర్షానికి గుంతలు పడి కోతకు గురైంది. ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపడుతుంటే అటవీశాఖ అధికారులు అనుమతుల పేరిట నిలుపుదల చేయించారు. చెక్‌పోస్టును ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు.
భక్తులు మాతో కొట్లాడుతున్నారు..
అటవీశాఖ అధికారులు సోమవారం కొత్తగా చెక్‌పోస్టు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. భక్తులు పైకి వచ్చి ఆలయ అధికారులు, సిబ్బందితో కొట్లాడుతున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారో వాళ్లకే తెలియాలి. ఒక్కో వాహనానికి రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఆలయానికి రావాలంటే కూడా అటవీశాఖకు డబ్బులు కట్టాలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చెక్‌పోస్టుతో మాకు సంబంధం లేదని చెప్పినా వినడం లేదు. చెక్‌పోస్టు పెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం భక్తులకు ఇబ్బందిగా ఉంది. రేంజర్‌ను అడిగితే మాకు తెలియదు.. పై అధికారులతో మాట్లాడండని అంటున్నారు. - కందూరి సుధాకర్, దేవాలయం చైర్మన్, అచ్చంపేట
టైగర్ రిజర్వు కాబట్టే..
వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడేందుకు వసూలు చేస్తున్నాం. టైగర్ రిజర్వు కాబట్టి అటవీలోకి వెళ్లే వాహనాలకు తప్పనిసరిగ్గా ఎంట్రీ ఫీజు ఉంటుంది. భక్తులు పడేసిన చెత్తను తొలగించేందుకు స్థానికులకు ఉపాధి కల్పిస్తాం. వసూలు చేసిన డబ్బులను స్థానికంగానే ఉపయోగిస్తాం. మద్దిమడుగులో కూడా చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఉమామహేశ్వరం ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి వాహనాలు వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఎంట్రీ ఫీజు మాత్రమే పెట్టాం. పార్కింగ్ ఫీజు పెట్టలేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండానే చూస్తున్నాం.
- కృష్ణగౌడ్, డీఎఫ్‌వో
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు