సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 17, 2020 , 05:09:38

కళాఉత్సవ్‌ పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి

కళాఉత్సవ్‌ పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి

నారాయణపేట రూరల్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్రం కళాఉత్సవ్‌ పేరిట 9 రకాల పోటీలను నిర్వహింస్తుందని డీఈవో రవీందర్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో డీఈవో సిబ్బందితో కలిసి రవీందర్‌ 9 రకాల పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. పోటీలో 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులు పాల్గొనాలన్నారు. 9 రకాల పోటీలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారని, ప్రతి విభాగంలో 1 బాలిక, 1 బాలుర చొ ప్పున ప్రతి మండలం నుంచి 18 మంది పాల్గొన వచ్చన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఎంఈవోలు, కాంప్లెక్స్‌  హెచ్‌ఎంలు, ఎమ్మార్సీ సిబ్బంది సహకారంతో 16 నుంచి 18 వరకు ఈ పోటీలను మండల స్థాయిలో నిర్వహిం చి, ఈ నెల 19న గెలుపొందిన విద్యార్థుల జాబితాను సెక్టోరియల్‌ అధికా రి రాజేందర్‌కుమార్‌కు అందజేయాలన్నారు. పోటీలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు హాజరయ్యేలా హెచ్‌ఎంలు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. 


VIDEOS

logo