మోటర్ వెహికిల్ చట్టాన్ని రద్దు చేయాలి

నారాయణపేట టౌన్ : మోటర్ వెహికిల్ చ ట్టం 2019 ఆటో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు తె చ్చి పెడుతుందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఐ ఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ, సహాయ కార్యదర్శి నరసింహలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఆటో కార్మికులతో ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మె కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న ట్రాక్టర్, టాటా ఏసీ తదితర వాహనాల డ్రైవర్లతో ప్రభుత్వం సంక్షేమ బో ర్డును ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే రోజు ల్లో రాష్ట్రంలో 2019 చట్టం అమలు జరిగితే జరిమానాలు పదిరెట్లు పెరుగుతాయన్నారు. దీని వల్ల రోజూ వారీగా పని చేసుకుని జీవించే ఆటోడ్రైవర్ల కు పెను భారంగా మారుతుందన్నారు. పెరిగిన ఇ న్సూరెన్స్ ధరలను తగ్గించి ప్రభుత్వమే భరించాలన్నారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బాలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్
- భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- 7న బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం
- అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ