ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 16, 2020 , 01:54:22

గోడ కూలి చిన్నారి మృతి

గోడ కూలి చిన్నారి మృతి

నారాయణపేట : నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే ఉన్న పెంకుటిల్లుపై కూలడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రమోహన్‌రావు కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ పక్కనే ఉన్న నగేశ్‌ పెంకుటిల్లుపై పడింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న 3 నెలల చిన్నారికి, ఆయన భార్య కవిత, కుమారుడు రాకేశ్‌లకు గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ దవాఖానాకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. నగేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

VIDEOS

logo