గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 16, 2020 , 01:54:23

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నారాయణపేట రూరల్‌ : అమావాస్యను పురస్కరించుకొని మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో బాలాజీస్వామి ఆలయంలో అర్చకులు మాణిక్‌శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహమంగళహారతి తదితర పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని కళబెళగుంది బనదేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించి స్వామిని దర్శించుకున్నారు.

VIDEOS

logo