బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Nov 16, 2020 , 01:54:22

నింగినంటినదీపావళి సంబురాలు

నింగినంటినదీపావళి సంబురాలు

  • ఆలయాల్లో ప్రత్యేక పూజలు

నారాయణపేట టౌన్‌ : చెడుపై మంచి గెలుపునకు చి హ్నంగా నిర్వహించే దీపావళి పండుగను జిల్లా కేంద్రంలో ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వ్యా పారులు దుకాణాల్లో, ప్రజలు ఇండ్లల్లో లక్ష్మీదేవి పూజలు చేశారు. ఇండ్ల ముంగిట కాంతులిచ్చే దీపాలను వెలిగిం చి పటాకులు కాల్చి ఆనందోత్సవాల మధ్య దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నారు. ప్రతిఒక్కరూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.   

ఊట్కూర్‌ : అన్ని గ్రామాల్లో ప్రజలు దీపావళి సంబురాలను ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచిని సాధించే విజయానికి సూచికగా, మహిళా శక్తికి ప్రతిరూపంగా, విజ్ఞా న్ని ప్రసాదించాలని, సిరి సంపదలు కలుగాలని కోరుకుం టూ శనివారం ప్రజలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో దీపావళిని పురస్కరించుకుని వ్యాపారులు లక్ష్మీదేవికి పూజలు చేశారు. పటాకులు కాల్చి ఆనందం పంచుకున్నారు. మండలంలోని ఆర్యసమాజ్‌ మందిరంలో దేవ యజ్ఞం నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వేడుకల్లో పాల్గొని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.    

మక్తల్‌ టౌన్‌ : పట్టణంలో ఘనంగా దీపావళి పండుగ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు లక్ష్మీ పూజలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ ఆలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలు చేశారు. పటాకుల వ్యాపారులకు విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రజలు స్వేచ్ఛగా ప టాకులు కాల్చారు. అదేవిధంగా నరకాసురు వధ కార్యక్రమాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారు. పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం, నల్లజానమ్మ ఆలయలం, వేంకటేశ్వర స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకున్నారు. ప్రతి ఆలయాన్ని దీపాలతో అలంకరించారు.

కృష్ణ : కృష్ణ, మాగనూర్‌ ఉమ్మడి మండలాలతోపాటు అన్ని గ్రామాల్లో దీపావళి పండుగ వేడుకలు ప్రజలు ఆనందోత్సవల మధ్య నిర్వహించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి నేపథ్యంలో మండల కే్రంద్రాలతోపాటు అన్ని గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పటాకులు కాల్చి, ఆడపడుచులు ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించారు. 


నారాయణపేట రూరల్‌ :  వివిధ గ్రామాల్లో దీపావళి సంబురాలను ఘనంగా నిర్వహించారు. పలు ఇండ్లల్ల్లో గౌరీనోములు నోచారు. వ్యాపారులు దుకాణాల వద్ద లక్ష్మి పూజలు చేశారు. పటాకులు కాల్చి, చిచ్చుబుడ్లు వెలిగించారు. పలు ఇండ్లల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేశా రు. అలాగే బంధువులకు పండుగ శు భాకాంక్షలు తెలియజేశారు.

ధన్వాడ : మండలంలోని కంసాన్‌పల్లి, గోటూర్‌, కొం డాపూర్‌, చర్లపల్లి, కిష్టాపూర్‌ గ్రామాలతోపాటు పలు గ్రా మాల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యా పారులు లక్ష్మీ పూజలు చేశా రు. పిల్లలు, యువకులు పటాకులు కాల్చారు. 

మరికల్‌ : దీపావళి పండుగను అన్ని గ్రామల్లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు ప్రజలు దీపావళి పం డుగను జరుపుకొన్నారు. లక్ష్మీ పూజలు, సత్యనారాయణ వ్రతాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. 

దామరగిద్ద : మండంలోని ప్రజలందరూ దీపావళి పండుగను ప్రశాంతంగా నిర్వహించారు. ఇండ్లల్లో దీపాలు వెలింగించారు. అంతకు ముందు ఆలయాలకు వెళ్లి  పూజలు నిర్వహించారు. పటాకు లు కాల్చి దీపావళి సంబురాలు నిర్వహించారు. 

నర్వ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు దీపావ ళి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయల్లో ప్రత్యేక పూజలు చేశారు. 

సాయంత్రం కొవిడ్‌ నిబంధనల ప్రకారం పటాకులు కాల్చారు. మండలంలోని ప్రజలందరికీ దీపావళి శుభాలను ఇవ్వాలని జడ్పీటీసీ జ్యోతిరెడ్డి, ఎంపీపీ జయరాములుశెట్టి అకాంక్షించారు. 

VIDEOS

logo