గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 14, 2020 , 05:50:16

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

నారాయణపేట : పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సిఫారసు మేరకు అత్యుత్తమ పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డు అందించడంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 24న నిర్వహించే జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. 2021 (2019-20)కి గానూ జిల్లాలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ శక్తికరణ్‌ పురస్కార్‌ కోసం 20 గ్రామ పంచాయతీలను, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామ సభ పురస్కార్‌ కోసం 10 గ్రామ పంచాయతీలను, చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు కోసం 20 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీపీవో మురళీ, ఏపీడీ సరళ పాల్గొన్నారు. 


VIDEOS

logo