సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 14, 2020 , 05:47:31

దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకోవాలి

నారాయణపేట : ఇంటర్‌ ప్రవేశాల కోసం మైనార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా మైనార్టీ గురుకులాల సమన్వయకర్త గులాం హుస్సేన్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో 2020-21కి గానూ నూతనంగా కళాశాల మంజూరైందన్నా రు. ఎంపీసీలో 40 సీట్లు , బైపీసీలో 40 సీట్ల ఉన్నాయన్నారు. మైనార్టీ పాఠశాలలో పదో తరగతి పాసైన విద్యార్థులపై చదువుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల మంజూరుకు కృషి చేసిన ఇంతియాజ్‌ ఇసాక్‌, అమీరుద్దీన్‌, అబ్దుల్‌ రహమాన్‌, ముజాయిద్‌ సిద్దిఖీ, మహ్మద్‌ అన్సారీలను అభినందించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ బాలనర్సింహస్వామి పాల్గొన్నారు. 


VIDEOS

logo