ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Nov 13, 2020 , 02:01:06

సకాలంలో రుణాలు చెల్లించాలి

సకాలంలో రుణాలు చెల్లించాలి

నారాయణపేట టౌన్‌ : మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని మెప్మా పీడీ కృష్ణమాచారి అన్నారు. గురువారం పట్టణంలోని 5వ వా ర్డులో పట్టణ ఇందిరా క్రాంతి పథం మహిళా పరస్పర సహా య సహకార ఐక్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడారు. మహిళా సంఘాల బలోపేతానికి తగిన సూచనలు అందించారు. 

నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి..

వీధి వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కృష్ణమాచారి అన్నారు. 6వ వార్డులో ఆత్మనిర్భర్‌ పథకంలో భాగంగా వీధి విక్రయదారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు, క్యూర్‌ కోడ్‌పై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలలో డీఎంసీ శేషన్న, టీఎంసీ లక్ష్మి, ఆర్పీలు పాల్గొన్నారు. 


VIDEOS

logo