సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 12, 2020 , 03:31:29

క్రైమ్‌ మ్యాపింగ్‌లో సమాచారాన్ని నమోదు చేయాలి

  క్రైమ్‌ మ్యాపింగ్‌లో  సమాచారాన్ని నమోదు చేయాలి

నారాయణపేట: క్రైమ్‌ మ్యాపింగ్‌లో పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగే నేరసమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నర్వ ఎస్సై నవీద్‌ సూచించారు. ఎస్పీ డా.చేతన ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల టెక్‌టీం పోలీస్‌ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరం జరిగిన తర్వాత సంఘటనా స్థలాన్ని సందర్శించినప్పుడు లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్‌ విధిగా క్రైమ్‌ డిటెయిల్‌ ఫారంలో నమోదు చేయాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూడాలన్నారు.

సీసీటీఎన్‌ఎస్‌లోని ప్రతి మాడ్యూల్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. హాక్‌ ఐ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎస్‌హెచ్‌వో దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా పాత నేరస్తుల ముఖ కవళికల ఆధారంగా ఏ విధంగా గుర్తించవచ్చో మిగతా సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. దర్పణ్‌ యాప్‌ ద్వారా తప్పిపోయిన వ్యక్తులను ఏ విధంగా గుర్తించవచ్చో అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో అన్ని పోలీస్‌ స్టేషన్‌ల టెక్‌ టీం ఆపరేటర్‌లు, ఐటీ సెల్‌ టీం శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొ న్నారు. 


VIDEOS

logo