డిజిటల్ లావాదేవీలతో ప్రయోజనాలు

నారాయణపేట టౌన్ : డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని మెప్మా ఏడీఎంసీ శేషన్న అన్నారు. సోమవారం పట్టణంలోని వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. క్యూఆర్ కోడ్ ఏ విధంగా ఉపయోగించాలి, దాని వాడకంతో వల్ల కలిగే ప్రయోజనాలపై వీధి వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ ద్వారా జరిపే లావాదేవీలో ఎలాంటి పొరపాట్లు జరుగవన్నా రు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ డిపాజిట్టు చేయడం, నగదు తీసుకోవడం తదితర ఇబ్బందులు తప్పుతాయన్నారు. స్మార్ట్‌ఫోన్‌తోనే కాకుండా చిన్న ఫోన్‌తో కూడా లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. వీధి వ్యాపారులు తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులోగా చెల్లించాలన్నారు. రాబోయే రోజుల్లో వీధి వ్యాపారులతో సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు, సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి ఎక్కువ మొత్తంలో రుణాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఎల్డీఎం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వీధి వ్యాపారులందరికీ దీపావళి లోగా రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
క్రీడాకారులకు యూనిఫాం పంపిణీ
మరికల్ : మండలంలోని క్రికెట్ క్రీడాకారులకు టీషర్టు, ప్యాంట్లను సీఐ శివకుమార్, ఎస్సై నాజర్ పంపిణీ చేశారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో క్రీడాకారులకు పవణ్కుమార్ జ్ఞాపకార్థం వారి స్నేహితులు రా ము, రవి ఆధ్వర్యంలో యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు మెలగాలన్నారు. కా ర్యక్రమంలో క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తులు పరిశీలన
ధన్వాడ : ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం పట్టభద్రులు చేసుకున్న దరఖాస్తులను ఆర్డీవో శ్రీనివాసులు పరిశీలించారు. సోమవారం మండలంలోని ధన్వా డ, కంసాన్పల్లి గ్రామాల్లో ఆర్డీవో పర్యటించారు. పట్టభద్రులు దరఖాస్తు చే సుకున్న వారి ఇండ్లలకు వెళ్లి తనిఖీ చేశారు. తప్పొప్పులు లేకుండా బీఎల్వో లు సరి చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ బాల్చంద ర్, ఆర్ఐ శ్రీనివాసులుగౌడ్, బీఎల్వోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్