నేరాల నిర్మూలనకు కృషి చేయాలి

- ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట : సరిహద్దు పోలీసు అధికారులు వా ట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేర వేసుకుంటూ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని ఎస్పీ డా క్టర్ చేతన అన్నారు. శనివారం తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. పేట జిల్లా ఎస్పీ డా క్టర్ చేతన, రాయచూర్ జిల్లా ఎస్పీ ప్రకాశ్, యాద్గీర్ జిల్లా ఎస్పీ రిషికేశ్ భగవాన్, గుల్బార్గా జిల్లా ఎస్పీ మారియన్ జార్జ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని పలుఅంశాలపై చ ర్చించారు. సరిహద్దు పరిసరాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు, తప్పిపోయిన వ్యక్తులు, ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ దొంగతనాలు, గుట్కా అక్రమ రవాణా, ఇసుక మాఫియా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, ఏటీఎం దొంగతనాల గురించి చర్చించారు.
సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు సమన్వయం తో పని చేస్తూ దొంగతనాలు, అక్రమ దందాలను అరికట్టాలని ఎస్పీలు తెలిపారు. కృష్ణానది పరీవాహక ప్రదేశాల్లో వ రదల సమయంలో ప్రాణనష్టం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసు అధికారులు పకడ్బందీగా విధులను నిర్వహిస్తూ నేరాలను నిరోధించాలని, నేరాలు జరిగిన సమయంలో సమన్వయంతో పని చేయడం ద్వారా సాక్షులను స్వీకరించి నేరస్తులకు శిక్షపడడంలో తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీలతోపాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత