గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 08, 2020 , 03:59:21

దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ

నారాయణపేట టౌన్‌ : రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వనజమ్మ అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అధికారుల సూచనల మేరకు ధాన్యంలో తాలు, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, జడ్పీటీసీ అంజలి, వ్యవసాయ శాఖ జి ల్లా అధికారి జాన్‌సుధాకర్‌, ఏఈవో ప్రణిత పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

దామరగిద్ద : మండంలోని విఠలాపూర్‌, అన్నాసాగర్‌, బాపన్‌పల్లి, మల్‌రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎం పీపీ నర్సప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని బయట మార్కెట్లో విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి లా భం పొందాలని రైతులను కోరారు. కార్యక్రమం లో వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు ఈదప్ప, తాసిల్దార్‌ ప్రమీల, ఎంపీటీసీ కిషన్‌రావు, నాయకులు , రైతు సమితి నాయకులు పాల్గొన్నారు. 

మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో...

మద్దూరు : మండలంలోని పల్లెగడ్డతండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ప్రారంభించారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకురావాలని ఐకేపీ అధికారు లు సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు స మితి మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పం చ్‌ కిష్టనాయక్‌, ఎంపీటీసీ చిన్నబాయి, ఇన్‌చార్జి ఏపీఎం సందప్ప, సీసీలు పాల్గొన్నారు.

కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట రూరల్‌ : మండలంలోని చిన్నజట్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ అంజలి, సర్పంచ్‌  రాములుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెర్ప్‌, డీఆర్డీఏ, సివిల్‌ స ప్లయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శకుంతల, సీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నా రు. అలాగే సింగారం చౌరస్తా వద్ద  కొనుగోలు కేంద్రం ప్రా రంభించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo