సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Nov 07, 2020 , 05:24:41

25 మందికి కొవిడ్‌ పరీక్షలు

25 మందికి కొవిడ్‌ పరీక్షలు

దామరగిద్ద : మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీవాసులకు శుక్రవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ వార్డు సభ్యులు ముందుగా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 25 మందికి పరీక్షలు నిర్వహించగా అం దరికీ నెగిటివ్‌ వచ్చిందని పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.

బోయిన్‌పల్లితండాలో...

నారాయణపేట రూరల్‌ : మండలంలోని బోయిన్‌పల్లితండాలో కోటకొండ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కొవిడ్‌ క్యాంప్‌ నిర్వహించారు. మొత్తం 55 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ వచ్చిందని వైద్యలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌టీ గోపాల్‌, ఉపసర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo