మత్స్యకారులకు మంచిరోజులు

- చేపల విక్రయానికి స్థానికంగానే మార్కెట్లు
- జూరాల బ్యాక్ వాటర్ ఉపయోగించుకునేలా మరో సాగునీటి ప్రాజెక్టుకు రూపకల్పన
- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- గడ్డంపల్లి వద్ద జూరాల బ్యాక్‌వాటర్‌లో 12.20 లక్షల చేపపిల్లలు విడుదల
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామ శివారులోని జూరాల బ్యాక్ వాటర్‌లో 12.20 లక్షల చేప పిల్లలను జెడ్పీ చైర్పర్సన్ వనజ, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను ఉపయోగించుకుని మరో భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని వెల్లడించారు. మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని చెప్పారు.
మక్తల్ రూరల్: రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని గడ్డంపల్లి గ్రామం వద్ద జూరాల బ్యాక్‌వాటర్‌లో 12.20 లక్షల చేపపిల్లలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామన్నారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుపై రివర్స్‌లో మరో పెద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి సీఎం సంకల్పించారన్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ నిపుణులతో రూపకల్పన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. గతంలో 23 జిల్లాలకు కలిపి చేపల పెంపకానికి రూ.2కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ.156కోట్లు ఖర్చు చేసిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఏవిధంగా కృషిచేస్తుందో అర్థమవుతుందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో నదీజలాలు, ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా ఉన్నాయన్నా రు. దీంతో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందుతున్నదన్నారు. స్థానికంగా మత్స్యకారులు చేపల కోసం గొడవలు పడకుండా అర్హత గల మత్స్య కార్మికులందరికీ సభ్యత్వం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే చేపల విక్రయానికి స్థానికంగా మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని, ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలాలను ఇచ్చిందన్నారు.
వంద చెరువుల్లో చేపల అభివృద్ధి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ నియోజకవర్గంలో చేపల అభివృద్ధికి 100 చెరువులను నింపామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే నియోజకవర్గంలో రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం, సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు వంద చెరువులను ప్రాజెక్టుల కింద అనుసంధానం చేశామని చెప్పారు. ప్రసుత్తం సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. మక్తల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజగౌడ్, డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా, నారాయణపేట కలెక్టర్ హరిచందన, కార్పొరేషన్ చైర్మన్ దేవరిమల్లప్ప, మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఎంపీపీ వనజమ్మ, మత్స్యశాఖ జిల్లా చైర్మన్ సత్యనారాయణ, జిల్లా అధికారి నాగులు, గడ్డంపల్లి సర్పంచ్ త్రివేణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ హన్మంతు, పస్పుల సర్పంచ్ దత్తప్ప, తాసిల్దార్ నర్సింగ్‌రావు, ఎంపీడీవో రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్