శనివారం 06 మార్చి 2021
Narayanpet - Nov 03, 2020 , 03:50:44

ఓటరు నమోదుపై అవగాహన

ఓటరు నమోదుపై అవగాహన

నారాయణపేట రూరల్‌ : డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తి మ్మారెడ్డి, జనార్ధన్‌రెడ్డి అన్నారు. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పేట జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల లో పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్ర ఆయుధమన్నారు. పట్టభద్రులు 2017కు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఈ నెల 6వ తేదీ లోగా ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, కార్యదర్శి నారాయణరెడ్డి, ఉట్కూర్‌ ఎంఈవో వెంకటయ్య, రాష్ట్ర అర్గనైజింగ్‌ నరేశ్‌, హెచ్‌ఎంలు, పట్టణ, మండల అధ్యక్షులు, వివిధ మండలాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


VIDEOS

logo