సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Nov 02, 2020 , 02:38:01

చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ

నారాయణపేట టౌన్‌ : చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, అందుకోసం ప్రజలందరూ సహకారం అందించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, కమిషనర్‌ శ్రీనివాసన్‌ అన్నా రు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు ఎస్‌ఎంఆర్‌ గ్రూప్‌కు అప్పగించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఎస్‌ఎంఆర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పని చేయాలని చెప్పారు. మున్సిపల్‌కు సంబంధించిన వాహనాలు కూడా వారి పరిధిలోనే ఉంటాయన్నారు.

పట్టణంలోని తడి, పొడి చెత్త సేకరణతోపాటు ఇతర అన్ని కార్యక్రమాలు ఎస్‌ఎంఆర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొనసాగుతాయన్నారు. ప్రజలందరూ సహకరించి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ చెన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.  


VIDEOS

logo