గురువారం 03 డిసెంబర్ 2020
Narayanpet - Nov 01, 2020 , 03:14:52

యువత ‘పటేల్‌'ను స్ఫూర్తిగా తీసుకోవాలి

యువత ‘పటేల్‌'ను స్ఫూర్తిగా తీసుకోవాలి

నారాయణపేట రూరల్‌ : ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభా య్‌ పటేల్‌ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్సీ కార్యాలయం వద్ద పీఆర్టీయూటీఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో పటేల్‌ చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలాధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గ్గొన్నారు. అదేవిధంగా తప స్‌ ఆధ్వర్యంలో ప టేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా పట్టణ, మండలంలోని వివిధ పాఠశాల ల్లో పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. 

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

దామరగిద్ద : మండలంతోపాటు, కానుకుర్తి పాఠశాలలో పటేల్‌ జయంతిని నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థు లు ఘనంగా నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంస్థానాలను విలీనం చేసిన మహనీయుడు 

మక్తల్‌ టౌన్‌ : దేశంలో సంస్థానాలను విలీనం చే సిన మహనీయుడు సర్దార్‌ అని మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌  బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పటేల్‌ జ యంతి సందర్భంగా ఏక్తాదివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు.

ఏకలవ్య స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో..

పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఏకలవ్య స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు, విశ్రాంత పీఈటీ గోపాలం ఆధ్వర్యంలో సీఐ శంకర్‌ జ్యోతి వెలిగించి ఏక్తాదివస్‌ ర్యాలీ ప్రారంభించారు. మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి స్థానిక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై అరుణ్‌, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పటేల్‌ జయంతి వేడుకలు

ఊట్కూర్‌ : పటేల్‌ జయంతి వేడుకలను వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించా రు. ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, గోపాల్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిడుగుర్తి యూపీఎస్‌ విద్యార్థి పటేల్‌ వేషధారణతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కృష్ణ : మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పటేల్‌ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయుడు నిజామోద్దీన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్సించారు. విద్యార్థులతో ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పలు పాఠశాలల్లో...

మాగనూర్‌ : మండలంలోని ప్రేగడబండ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో సర్దార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నరేందర్‌, ఎస్‌వో రాధిక, సీఆర్టీలు పాల్గొన్నారు.

సంత బజార్‌ ప్రభుత్వ పాఠశాలలో..

ధన్వాడ : మండలంలోని సంత బజార్‌ ప్రభుత్వ పాఠశాలలో పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ర్పించా రు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థు లు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, ఉపాధ్యాయులు, సీఆర్పీ నారాయణతోపాటు పలువురు పాల్గొన్నారు.

రాష్ట్రీయ ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ

జడ్చర్ల టౌన్‌ : సర్దార్‌ జయంతి సందర్భం గా నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తాదివస్‌ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాదేపల్లి జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఎంఈవో మంజులాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. మల్లెబోయిన్‌ప ల్లి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయు లు భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతిజ్ఞ చేశా రు. రాష్ట్రీయ ఏక్తావస్‌ను ఉద్దేశించి ఉపాధ్యాయులు వివరించారు. 

పటేల్‌ సేవలు మరువలేనివి

దేవరకద్ర రూరల్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశాభివృద్ధికి అందించిన సేవలు మ రువలేనివని ప్రధానోపాధ్యాయులు నాగేందర్‌, వెంకటేశ్వర్లు అన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకొని మండలంలోని డో కూర్‌, లక్ష్మీపల్లితోపాటు పలు గ్రామాల్లోని పాఠశాలల ఆవరణలో పటేల్‌ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసారు. విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుధాకర్‌, అధ్యాపకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది

మహబూబ్‌నగర్‌ : కలెక్టరేట్‌లోని పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రం అందించిన ప్రతిజ్ఞను కలెక్టరేట్‌ కార్యాలయ అధికారులు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో ప్రేమ్‌రాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఏక్తాదివస్‌ పురస్కరించుకొని

మహబూబ్‌నగర్‌ క్రైం : పటేల్‌ దేశానికి చేసిన సేవలు మరువలేవని డీఎస్పీ శ్రీధర్‌ అన్నారు. ఏక్తాదివస్‌ పురస్కరించుకొని ఆయన చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీలో జిల్లా తరఫున ఉత్తమంగా నిలిచిన జిల్లా ఫొటో జర్నలిస్టులు భా స్కరాచారి, గోపీ, గడ్డం రవికుమార్‌, కిరణ్‌కుమార్‌, వీడి యో జర్నలిస్టు సంతోష్‌ కుమార్‌లకు జ్ఞాపికలను అందజేశారు.  కార్యక్రమంలో డీఎస్పీ భూపాల్‌, ఇన్‌స్పెక్టర్‌, ఆర్‌ఎస్సై రాజు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట య్య, పీఆర్వో మన్మోహన్‌ పాల్గొన్నారు.

జాతీయ సమైక్యతకు కృషి చేసిన పటేల్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జాతీయ సమైక్యత కోసం పటేల్‌ చేసిన కృషి మరువలేనిదని పాలమూరు విశ్వవిద్యాలయంలో పరీక్షల నియంత్రణ అధికారి కుమార స్వా మి అన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఎక్‌భారత్‌.. శ్రేష్ఠ భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తాదివస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమం లో అధ్యాపకులు పాల్గొన్నారు.

ఎంవీఎస్‌ కళాశాలలో..

ఎంవీఎస్‌ కళాశాలలో సర్దార్‌ జయంతిని  ఘనంగా ని ర్వహించారు. ముందుగా పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఈశ్వరయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

వీహెచ్‌పీ కార్యాలయంలో...

జిల్లా కేంద్రంలోని విశ్వహిందు పరిషత్‌ కార్యాలయం లో సర్దార్‌ జయంతిని  ఘనంగా నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.