బుధవారం 02 డిసెంబర్ 2020
Narayanpet - Oct 31, 2020 , 01:47:57

జాజాపూర్‌లో నాటక ప్రదర్శన

జాజాపూర్‌లో నాటక ప్రదర్శన

నారాయణపేట రూరల్‌ : మండలంలోని జాజాపూర్‌లో  శ్రీమద్‌ విరాట్‌  పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన గురువారం రాత్రి ప్రారంభమైంది. సర్పంచ్‌ కోట్ల సుగందమ్మజగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సీఐ శ్రీకాంత్‌రెడ్డి హాజరై నాటక ప్రదర్శనను రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, ఎస్సై చంద్రమోహన్‌రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో రవీందర్‌గౌడ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.