భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ

Oct 31, 2020 , 01:33:56

నారాయణపేట నమస్తే తెలంగాణ : పేట పట్టణంలో మిలా ద్‌ ఉన్‌ నబీ వేడుకలను శుక్రవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదులో సాముహిక నమాజ్‌ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ ఇఫ్తేకార్‌అహ్మద్‌, ఎస్సైలు చంద్రమోహన్‌రావు, నాసర్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.

నారాయణపేట మండలంలో..

నారాయణపేట రూరల్‌: మండల పరిధిలోని జాజాపూర్‌, కోటకొండ, కొల్లంపల్లి, సింగారం తదితర గ్రామాల్లో శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదులో సాముహిక నమాజ్‌ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

ధన్వాడలో..

ధన్వాడ: మండలంలో శుక్రవారం ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకు ముందు రాత్రి మసీదులో జాగరణ కార్యక్రమం నిర్వహించి మహ్మద్‌ ప్రవక్త ప్రవచనలు చదివారు. కార్యక్రమంలో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

కోస్గిలో..

కోస్గి టౌన్‌: మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ముస్లిం యువకులు, మతపెద్దలు పెద్దఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బీసీ కాలనీ శివాజీచౌరాస్తా మీదుగా మున్నూర్‌వీధి, తెలుగు వీధులగుండా ర్యాలీ కొనసాగింది. మహమ్మద్‌ సల్లిల్లావాలెసలీం జన్మదినం సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తామని ముస్లిం మతపెద్దలు సదర్‌లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మద్దూరులో..

మద్దూరు: మండలంలోని మద్దూరు, రెనివట్ల, భూనీడు, నిడ్జింత తదితర గ్రామాల్లో శుక్రవారం ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన మతపెద్దలు పండగ శుభాకాంక్షలు వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన మతపెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు.

కృష్ణ మండలంలో..

కృష్ణ: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంతోపాటు ముడుమాల, హిం దూపూర్‌, గుడెబల్లూర్‌ గ్రామాల్లో ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అబ్దుల్‌ఖాదీర్‌, చాంద్‌పాషా, నూర్‌మహమ్మద్‌, నజీర్‌, కతాల్‌సాబ్‌ పాల్గొన్నారు.

ఊట్కూర్‌లో..

ఊట్కూర్‌ : మహ్మద్‌ ప్రవక్త జయంత్యుత్సవాల్లో భాగంగా ముస్లింలు శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదిన వేడుకలను జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో మతపెద్దలు ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడుతూ ప్రవక్త మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలని సూచించారు. యువత సన్మార్గంలో నడువాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, మహిళలపై మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. ఊట్కూర్‌ మక్కా మసీద్‌, షాహీ మసీద్‌, చిన్నపొర్ల పంచ్‌ మసీద్‌ వద్ద పేదలకు అన్నదానం చేశారు. పలు గ్రామాల్లో ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD