శుక్రవారం 04 డిసెంబర్ 2020
Narayanpet - Oct 30, 2020 , 01:37:23

రైతుల పాలిట వరం

రైతుల పాలిట వరం

నారాయణపేట రూరల్‌ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించడంపై రైతుల పాలిట వరం లాంటిదని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షు డు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని ఈ పోర్టల్‌ ద్వారా రైతుల భూములకు శ్రీరామ రక్ష అన్నారు. ఇకపై రైతుల భూములు వారి ప్రమే యం లేకుండా ఇతరులకు మార్పిడిలు జరుగకుండా రక్షిస్తున్నదన్నారు. మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్లు, విరాసతపై రైతు లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వివిధ సంక్షే మ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.