మంగళవారం 01 డిసెంబర్ 2020
Narayanpet - Oct 30, 2020 , 01:37:29

రేపు రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ ప్రతిజ్ఞ చేయాలి

రేపు రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ ప్రతిజ్ఞ చేయాలి

నారాయణపేట రూరల్‌ : సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భం గా ఈ నెల 31న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ను పాటించి ప్రతిజ్ఞ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గ్గొనేటట్లు కృషి చేయాలన్నారు. ఎంఈవోలు, సీఆర్పీల ద్వారా ఏక్తా దివాస్‌లో పాల్గొన్న పాఠశాల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను తీసుకొని విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.