శుక్రవారం 27 నవంబర్ 2020
Narayanpet - Oct 29, 2020 , 03:01:48

నేటి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన

నేటి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన

నారాయణపేట రూరల్‌: పేట మండల పరిధిలోని జాజాపూర్‌ గ్రామంలో నేటి నుంచి 5 రోజులపాటు శ్రీమద్‌ విరాట్‌  పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాస్టర్‌ హన్మంతు పుట్టగడ్డ అప్పక్‌పల్లి  ఆధ్వర్యంలో 29వ తేదీ రాత్రి ప్రారంభమై 2వ తేదీ వరకు నాటక ప్రదర్శన ఉంటుందని ప్రేక్షకులు మాస్కులు ధరించి నాటకాన్ని వీక్షించాలని  తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్పంచ్‌ కోట్ల సుగంధమ్మ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీపీ అమ్మకోళ్ల  శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి ముఖ్య అతిథులుగా హాజరవుతారని, సీఐ శ్రీకాంత్‌రెడ్డి నాటక ప్రదర్శన ప్రారంభిస్తారని తెలిపారు.