గిరిజన పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Oct 29, 2020 , 02:42:06

నారాయణపేట, నమస్తే తెలంగాణ:        జిల్లాలోని గిరిజన పారిశ్రామిక వేత్తల నుంచి సీఎం ఎస్టీ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌, ఇన్నోవేషన్‌ పథకం కింద స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్వారా సామర్థ్యాల పెంపుదల శిక్షణ, పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామిక వేతనాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రకటనలో తెలిపారు. పరిశ్రమ, వ్యాపారాలపై ఆసక్తి, అర్హత కలిగిన గిరిజన పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు, వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులను పంపాలని ఆయన పేర్కొన్నారు. 

విదేశాల్లో చదువుల కోసం  మైనార్టీ స్కాలర్‌షిప్‌

నారాయణపేట, నమస్తే తెలంగాణ:  2020 సంవత్సరంలో విదేశీ విశ్వ విద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయే ట్‌, డాక్టరేట్‌ కోర్సులకుగానూ స్కాలర్‌షిప్‌ మంజూరు కోసం అర్హత గల మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు వివిధ అర్హత ప్రమాణాల మేరకు  దరఖాస్తు చేయుటకు వివిధ దేశాల వివరాలతో వచ్చే నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD