రేషన్‌ బియ్యం తరలింపు

Oct 28, 2020 , 01:36:18

నర్వ : రేషన్‌ బియాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీ ఎం వాహనాన్ని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీద్‌ తెలిపారు. మంగళవారం ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజల నుం చి తక్కువ ధరకు దాదాపు 20 క్వింటాళ్ల రేషన్‌ బియాన్ని కొనుగోలు చేసి గద్వాలకు తరలిస్తుండగా పోలీసుల సహాయంతో పట్టుకున్నామన్నారు. గద్వాలకు చెందిన తెలు  గు జనార్దన్‌ డీసీఎం ఏపీ 21 టీవై1305 నంబర్‌ గల వాహనం డ్రైవర్‌ కిశోర్‌ సహాయంతో తరలిస్తుండగా క ల్వాలలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా వాహ నాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్దారించారు. డీసీఎం ను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన అనంతరం ఆర్‌ఐ జాఫర్‌తో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌, కానిస్టేబుల్స్‌ వేణుగోపాల్‌, రాజేశ్వర్‌రెడ్డిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD