శుక్రవారం 04 డిసెంబర్ 2020
Narayanpet - Oct 28, 2020 , 02:10:45

1న ప్రవేక్ష పరీక్షకు హాజరు కావాలి

1న ప్రవేక్ష పరీక్షకు హాజరు కావాలి

నారాయణపేట రూరల్‌ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వి ద్యాలయా ల్లో 5వ తరగతిలో ప్రవేశం పొందుటకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు చేసుకున్న విద్యార్థులు నవంబర్‌ 1న నిర్వహించనున్న పరీక్షకు హాజరు కావాలని జిల్లా కో ఆర్డినేటర్‌ దేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని దేవసేన సూచించారు. పరీక్షకు హాజరై విద్యార్థులు ఎగ్జామ్‌ ప్యాడ్‌, హాల్‌ టికెట్‌, బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నులు, మాస్కులు తప్పకుండా తీసుకొని రావాలన్నారు. జిల్లాలో ఊట్కూర్‌, మక్తల్‌, దామర్‌గిద్ద (సింగారం ఎక్స్‌ రోడ్డు)నందు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

తాజావార్తలు