సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Oct 28, 2020 , 02:10:43

అధికారులకు సహకరించాలి

అధికారులకు సహకరించాలి

  •  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్‌ 

దామరగిద్ద : రైతులందరూ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడానికి వచ్చే అధికారులకు సహకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ అ ధికారి జాన్‌సుధాకర్‌ అన్నారు. మంగళవారం మండంలోని లోకుర్తిలో జాన్‌సుధాకర్‌ రైతులతో సమావేశం నిర్వహించారు. పంటల్లో వచ్చే తెగుళ్ల నివారణ గురించి అవగాహన కల్పించారు. అనంతరం వర్షాలకు నష్టపోయిన రై తుల పంట వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, నూనె గింజలు, వేరుశనగ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరవిందు, విస్తరణ అధికారి స్వప్న, సర్పంచ్‌ మహేశ్వరి, ఎంపీఈసీ కొండప్ప, రైతు సమన్వయ సమితి మండ కన్వీనర్‌ రాచప్ప, రైతులు పాల్గొన్నారు.

పంటల వివరాలు నమోదు 

కృష్ణ : నష్టపోయిన రైతుల పంటల వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు అధిక వర్షాల కారణంగా పంటలు వరి, పత్తి, ఆముదం, మిరప, పండ్ల తోటలు నష్టపోయిన రైతుల పూర్తి వివరాలను ఆయా గ్రామాల్లోని ఏఈవోలు మంగళవారం నమోదు చేపట్టారు. నమోదుకు రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డ్‌, బ్యాంక్‌ అకౌంట్‌ పుస్తకం జిరాక్స్‌ కా పీలతో ఏఈవోలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఏఈవోలు, రైతుబంధు గ్రామ సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.

VIDEOS

logo