ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Oct 28, 2020 , 02:10:43

మూడు నెలలు జాగ్రత్తలు తప్పనిసరి

మూడు నెలలు జాగ్రత్తలు తప్పనిసరి

నారాయణపేట టౌన్‌ : చలికాలం కారణంగా రాబోయే 3 నెలలపాటు కొవిడ్‌ -19కు సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ వాకటి కరుణ, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీ నివాసరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వైద్యశాఖ ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. చలితీవ్రత కారణంగా వాతావరణంలో గాలి లో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల 20 శాతం ప్రజలు ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్‌ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సెల వు దినాల్లో టెస్ట్‌లు తక్కువగా చేస్తున్నారన్నారు. వాక్సిన్‌ వచ్చే వరకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పా టించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, సమూహంతో కూడిన సమావేశాలను నిర్వహించరాదన్న విషయాలపై ప్రజల్లో విస్తృతం గా అవగాహన కల్పించాలన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా గ్రామాల్లో ఆర్‌ఎంపీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ సి బ్బంది, పోలీస్‌ శాఖ వారితో సమావేశాలు నిర్వహించి కొవిడ్‌పై అవగాహ న కల్పించాలన్నారు. గ్రామాల్లో మై క్‌ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌, డీపీవో మురళితోపాటు ప్రో గ్రాం అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo