ప్రజలకు సేవలు అందించాలి

Oct 27, 2020 , 04:51:15

నారాయణపేట : ప్రజలపై దురుసుగా ప్రవర్తించకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్‌ చేతన సూచించారు. తొమ్మిది నెల ల శిక్షణ పూర్తి చేసుకొని 93 మంది పోలీస్‌ కానిస్టేబుల్స్‌ సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయగా వారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలపై మానవతా దృక్పథంతో ఉండాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో ఎటువం టి తారతమ్యభావం లేకుండా పని చేయాలన్నారు.

పోలీసులకు ఎదుర య్యే ప్రతి సమస్యపై చాకచక్యంగా వ్యవహరిస్తూ, ఆలోచన పరంగా సహృద య భావంతో మెలగాలన్నారు. అధికారుల సూచనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఏ చిన్న తప్పు చేసినా దాని ప్రభావం పోలీస్‌శాఖపై పడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆర్ముడ్‌ రిజర్వ్‌) భర త్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, డీపీవో సూపరింటెండెంట్‌ బాలరాజు పాల్గొన్నారు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD